వేసవిలో నీటి సమస్యలు లేకుండా చర్యలు

వేసవిలో నీటి సమస్యలు లేకుండా చర్యలు

విశ్వంభర, పరిగి: వేసవి కాలంలో ప్రజలకు మంచినీటి కష్టాలు ఎదురుకాకుండా తక్షణ చర్యలు తీసుకుంటున్నామని 13వ వార్డు కౌన్సిలర్ మీర్ సమీనా తాహేర్ అలీ అన్నారు. పరిగి మున్సిపాలిటీ పరిధిలోని పట్టణంలోని 13వ వార్డు ఖాన్ కాలనీలో మిషన్ భగీరథకు అనుసంధానమైన బోరు మోటార్ చెడిపోవడంతో నీటి సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడింది.  సమస్య తెలిసిన వెంటనే స్పందించిన కౌన్సిలర్  మున్సిపల్ సిబ్బంది సహాయంతో చెడిపోయిన బోరు మోటార్‌ను తొలగించి, కొత్త మోటార్‌ను ఏర్పాటు చేయించారు. దీంతో కాలనీలో నీటి సరఫరా  పునరుద్ధరించబడింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. వేసవి కాలంలో నీటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ఎక్కడైనా నీటి సమస్య తలెత్తిన వెంటనే స్పందించి పరిష్కరించే విధంగా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అన్నారు. కౌన్సిలర్ పట్ల స్థానిక ప్రజలు  కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలోఖాజామోయినోద్దిన్, యూసుఫ్, సయ్యద్ చాంద్ పాషా, అంజద్, తదితరులు పాల్గొన్నారు.

Tags: