మహేశ్వరం లో 'పోషణ పక్వాడ' ప్రారంభం
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం అమీర్పేట్, మాణిక్యమ్మ గుడ గ్రామంలో పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా ఐ .సి .డి ఎస్ .ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అమీర్పేట్,మాణిక్యామ్మగూడ గ్రామం లో సిడిపిఓ శాంతి శ్రీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పోషణ పక్వాడ లో భాగంగా గ్రామంలో ఉన్న వృద్దులు ఎక్కువ గా జొన్నలు , రాగులు సద్దాలతో తయారు చేసిన ఆహారం ఎక్కువ తిని ఆరోగ్యాంగా ఉన్నామని, తమఅనుభవాలని తెలియజేశారు, ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పతుల మల్లమ్మ వారి అనుభవాలు వివరించారు, సీడీపీఓ శాంతిశ్రీ మాట్లాడుతూ బిడ్డకు పుట్టగానే మురుపాలను వెంటనే గంట లోపలనే పట్టించాలి. మురుపాలలో ఉండే లాభాల గురించి కూడా తెలియజేయడం జరిగింది, ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఎలాంటి ద్రవపదార్థాలు కూడా బిడ్డకు ఇవ్వకూడదు తల్లిపాల వల్ల బిడ్డకు ఎన్నో ప్రయోజనాలు ఇమ్యూనిటీ పిల్లల్లో రోగ నిరోధక శక్తి ఉంటుంది, బిడ్డకు తల్లిపాల్లో కావలసిన పోషకాలు ద్రవపదార్థాలు అన్ని తల్లిపాలలో ఉంటాయి ఎలాంటి ఇతర ఆహారము ద్రవ పదార్థాలను బిడ్డకు ఇవ్వకుండా కేవలం ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి, ఆరు నెలలు నిండిన తర్వాత బిడ్డకు తల్లిపాలతో పాటు అదనపు ఆహారాన్ని ఇవ్వడం గురించి కూడా తెలియజేయడం జరిగింది, గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి మానసికంగా ప్రశాంతంగా ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా ఆ ప్రశాంతమైన వాతావరణం లో ఉండాలే గర్భిణిగా ఉన్నప్పుడు అత్త భర్త సపోర్టు కూడా ఉండాలి, గర్భిణిగా ఉన్నప్పుడు అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేయించుకుని ఆరోగ్య లక్ష్మి కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే ఒక పూట సంపూర్ణ భోజనాన్ని కూడా ప్రతి తల్లి వినియోగించుకోవాలి ఇంకా గ్రామ వార్డ్ సభ్యులు మంచినీళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న కెమికల్ వాడిన అంత కలుషితం అవుతుంది అందరూ ఆర్గానిక్ ఫుడ్ తినడం మంచిది అని వివరించారు, ఈ కార్యక్రమంలో గ్రామ ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీదేవి ,గ్రామ వార్డ్ సభ్యులు ఉప సర్పంచ్ చేగురి చంద్రకళ,వన్నడ రమాదేవి,అంగన్వాడీ టీచర్స్ వరలక్ష్మి, సుగుణ, అనిత, జయమ్మ,విజయకుమారి, సంతు, గర్భిణీలు తల్లులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది.



