ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపిడిఓ
On
విశ్వంభర, ఆత్మకూరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం పారుపల్లి గ్రామం శుక్రవారం మండలాభివృద్ధి అధికారి జె రాములు నాయక్ ఉపాధి హామీ పనులను పరిశీలించారు. అనంతరం కూలీలతో మాట్లాడుతూ, వేసవికాలం ఎండలు ఎక్కువగా ఉంటున్నందున ఉదయం పూటనే వచ్చి పనులు పూర్తిచేసుకోవాలనీ అన్నారు. వడదెబ్బకు గురికాకుండా ఉండాలని సూచించారు. పలు అంశాలపై చర్చించి పలు సలహాలు సూచనలు చేశారు.వీరివెంటా ఉపాధి హామీ ఏపీఓ రమేష్, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు.



