సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన కునూరు రామచంద్రం, మేడి అరవింద్, చలమల శ్రీనివాస్ రెడ్డి, చిరబోయిన నవీన్ శిల్ప, కునూరు సుస్మిత లకు నకిరేకల్ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ వేముల వీరేశం సహకారంతో బోగారం గ్రామ మాజీ సర్పంచ్ గంపల రామచంద్రారెడ్డి చేతులమీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బాధితులు శాసనసభ్యులు వేముల వీరేశం కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో భోగారం కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు, మధ్యపురి ఐలయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గోగు హరిప్రసాద్ యాదవ్, మాజీ ఎంపీటీసీ గోగు పద్మ సత్తయ్య యాదవ్, వార్డు సభ్యులు గోగు సురేష్ యాదవ్, కనుకు మల్లేశం, చిరగొని శిల్పా నవీన్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



