ప్రపంచ రెడ్ బుక్ డే 

ప్రపంచ రెడ్ బుక్ డే 

విశ్వంభర, నాగారం: ప్రపంచ  రెడ్ బుక్ డే సందర్భంగా డి కొత్తపల్లి స్టేజి  వద్ద సిపిఐ(ఎం ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్  మాట్లాడుతూ,  ఫిబ్రవరి 21, 1848న లండన్‌లోని ఒక మామూలు ముద్రణాలయం నుంచి వెలువడిందో  చిన్న పుస్తకం – కానీ పెద్ద ప్రకంపనలు సృష్టించిందని అన్నారు. అది చేసిన శబ్దం ఖండాల్ని దాటి చరిత్రను కుదిపేసిందని, దాని పేరే కమ్యానిస్టు ప్రణాళిక ఆ రోజునే మనం ”రెడ్‌ బుక్‌ డే”గా గుర్తు చేసుకుంటున్నామని చెప్పారు. నేడు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పేరుతో అమెరికా అనేక దేశాలపై అధిక సుంకాలను విధిస్తూ ఆయా దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తుంది ప్రపంచ ఆధిపత్య పోరులో పరుగులు తీస్తుంది ఇలాంటి సందర్భంలో పీడిత ప్రజలను మరింతగా ఐక్యం చేసి పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు.  అందుకు కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక వెలుగులో ముందుకు సాగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో లో ఏ ఐకె ఎం ఎస్  జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, పి డి ఎస్ యూ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబోయిన కిరణ్, మాజీ సర్పంచ్ యానాల సుధాకర్ రెడ్డి ,  భయం లింగయ్య, పల్లెర్ల సోమయ్య, యెషబోయిన లింగయ్య వప్పు అమృత, కొండ నాగరాజు, వేముల గణేష్, కుతేటి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags: