జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలి

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలి

విశ్వంభర, భూపాలపల్లి : కేంద్రంలో బీజేపీ సర్కార్, రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడాలని,జర్నలిస్టుల హక్కులను కాపాడాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టిఎస్ జేయు)నాయకులు కోరారు. బీహార్ రాష్ట్రంలోని సాసారమ్ జిల్లా కేంద్రంలోని గోపాల్ నారాయణ విద్యాలయ ప్రాంగణంలో శని,ఆదివారాలలో జాతీయ అధ్యక్షులు అశోక్ మాలిక్,సెక్రటరీ జనరల్ సురేష్ శర్మ,జాతీయ ఉపాధ్యక్షులు నారగౌని పురుషోత్తం ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఇండియా (ఎన్.యు.జె (ఇండియా) జాతీయ కార్యవర్గ సమావేశానికి తెలంగాణ రాష్ట్రం నుండి తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టిఎస్ జెయు) రాష్ట్ర అధ్యక్షులు మెరుగు చంద్రమోహన్,ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్,జాతీయ నాయకులు పావుశెట్టి శ్రీనివాస్,జయశంకర్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్,ప్రధాన కార్యదర్శి జల్దీ రమేష్ లు పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా కౌన్సిల్ సమావేశంలో సంతోష్, రమేష్,శ్రీనివాస్ లు జర్నలిస్ట్ లు మాట్లాడారు.తెలంగాణలో జర్నలిస్టులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని కౌన్సిల్ దృష్టికి తీసుకు వచ్చారు.అర్హులైన జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు కేటాయించి,వారికీ ఇండ్లు నిర్మించాలని కోరారు.జర్నలిస్ట్ హెల్త్ కార్డు లు పరిమితి నిబందన లేకుండా అన్ని కార్పొరేట్ ఆసుపత్రిలో అమలయ్యేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.అదేవిధంగా జర్నలిస్ట్ పిల్లలకు  ప్రాథమిక,ఉన్నత విద్యతో పాటు వృత్తి,నైపుణ్య విద్య కోర్సుల్లో కార్పొరేట్,ప్రైవేటు,పాఠశాల,కళాశాలల్లో 50% ఫీజు రాయితీ కల్పించాలన్నారు.

Tags:  

Advertisement

LatestNews

విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం - ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
చండూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం - డా. కోడి శ్రీనివాసులు సహకారంతో పేద ప్రజలకు వైద్య సేవలు 
ఘనంగా చండూర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ - -ఆవిష్కరించిన  మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ 
మంత్రిని కలిసిన పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ , వైస్ చైర్మన్  - పోచంపల్లి బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం 
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు