ధ్రువ తారల్లా వెలిగిన ధ్రువ కాలేజ్ విద్యార్థులు.- ప్రిన్సిపల్ ఆకుల శ్రీనివాస్ వెల్లడి
విశ్వంభర హనుమకొండ జిల్లా +-వరంగల్ జిల్లా పోచమ్మ మైదాన్ సమీపంలో ఉన్న ధ్రువ కాలేజ్ విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారని ధ్రువ కాలేజీ ప్రిన్సిపాల్ ఆకుల శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీసీ విభాగం లో 1000 మార్కులకు గాను షేక్ అయేషా 992 మార్కులు, సాఫియా హసన్ 991 మార్కులు, కే భార్గవి 990 మార్కులు, బైపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను తైసిన్ 986 మార్కులు, ప్రణతి 984 మార్కులు, అయేషా మీర్జా 979 మార్కులు సాధించారనీ తెలిపారు. ఫస్ట్ ఇయర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను కే సింధూర 463 మార్కులు, బైపిసి విభాగంలో రబియా సుల్తానా 435 మార్కులు ,ఎండి ఫరీదా 43 మార్కులు ,జె జయశ్రీ 430 మార్కులు. ఫస్ట్ ఇయర్ సీఈసీ విభాగంలో 500 మార్కులకు గాను 487 మార్కులు బి రాగ శ్రీ సాధించారని తెలిపారు. గత కొన్ని సంవత్సరములుగా కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ఫలితాలను సాధిస్తూ ఆదివారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మరోసారి చరిత్రను తిరగరాస్తు ఎంపీసీ, బైపీసీ, సిఇసి, విభాగాల్లో మంచి మార్కులు సాధించిన ధ్రువ కాలేజ్ విద్యార్థినీ, విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ ఆకుల శ్రీనివాస్ డైరెక్టర్లకు అభినందనలు తెలిపారు. ఈ విజయానికి సహకరించిన కళాశాల అధ్యాపకులకు, విద్యార్థిని, విద్యార్థుల, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేశారు.



