ఇంటర్ ఫలితాల్లో ‘హయత్​నగర్​ మైనారిటీ రెసిడెన్షియల్’ విద్యార్థినులు ప్రతిభ

ఇంటర్ ఫలితాల్లో ‘హయత్​నగర్​ మైనారిటీ రెసిడెన్షియల్’ విద్యార్థినులు ప్రతిభ

* ఫస్టియర్​, సెకండియర్​.. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో అత్యుత్తమ మార్కులు 
* రాష్ట్రస్థాయిలో మెరిసిన పలువురు అమ్మాయిలును అభినందించిన ప్రిన్సిపాల్ దేవిరెడ్డి​ జ్యోతి

విశ్వంభర, హయత్​నగర్​ : ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్​ హయత్​నగర్​ బాలికల కళాశాలకు చెందిన విద్యార్థినులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో మంచి మార్కులు సాధించి కాలేజీకి మంచి పేరు తీసుకువచ్చారు. ఫస్ట్​ ఇయర్​ ఎంపీసీ విభాగంలో దీక్షిత 470కి గాను 464 మార్కులు సాధించారు. బైపీసీలో నౌషీన్​ పర్వీన్​ 440 మార్కులకు గాను 435 మార్కులు, కీర్తన 440కి 433 మార్కులు సాధించి ప్రతిభ చాటుకున్నారు. ఇక రెండో సంవత్సరం ఎంపీసీ విద్యార్థి  సిరివర్శిని 1000 మార్కులకు గాను  984 మార్కులు సాధించగా,  దీవెన కుమారి 1000కి 979 మార్కులు సాధించింది. సెకండియర్​ బైపీసీ విభాగంలో లాస్య 1000 మార్కులకు  988 మార్కులు, శుభశ్రీ 1000 మార్కులకు గాను 988 సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపారు.  ఇంటర్​  ఫస్టియర్​, సెకండియర్​ విద్యార్థినులు 98 శాతం చొప్పున ఉత్తీర్ణత నమోదు కావడం విశేషం. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ దేవిరెడ్డి జ్యోతి, కళాశాల కో ఆర్డినేటర్​ జి. రమాదేవి  మాట్లాడుతూ విద్యార్థినుల కృషి, అధ్యాపకుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి కొనసాగిస్తామని పేర్కొన్నారు. విద్యార్థినుల భవిష్యత్​ విజయవంతంగా, ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు.

Tags: