ఘనంగా శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం.
ముఖ్య అతిధిగా పాల్గొన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి
విశ్వంభర, హైదరాబాద్ :- శోభన్ బాబు సేవా సమితి తెలంగాణ వారి ఆధ్వర్యంలో 18 వ వర్ధంతిని పురస్కరించుకొని వారి జ్ఞాపకార్ధం కొత్తపేట చౌరస్తా లో ఫౌండర్ అండ్ చైర్మన్ పివి శేషేందర్ రావు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆంధ్రుల అందగాడు అలనాటి సినీహీరో శోభన్ బాబు పేరు మీద గత పద్దెనిమిది సంవత్సరాలుగా సామాజిక సేవ కార్యక్రమాలతో పాటు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాల సంతోషంగా ఉందని అన్నారు. నాటికీ నేటికీ అందాల నటుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం శోభన్ బాబు గారే అని అన్నారు. అంతేకాకుండా సినీ పరిశ్రమలో తనకు దగ్గర ఉన్న వ్యక్తులకు ఎన్నో మంచి , ఆర్థికపరమైన సలహాలు ఇచ్చేవారని వారన్నారు. ముఖ్యం గా మన దగ్గర ఎంతో కొంత డబ్బు ను భూమి ని కొనుక్కొని పెట్టండి భవిష్యత్తులో మనకు భరోసానిస్తుందని చాలామందికి ఇలా సలహాలు ఇచ్చేవారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రవణ్ కుమార్, కప్పరి శంకర్ రావు , జగదీశ్ ,ఎండి సలీం , మురళి ,అశోక్ , రమణ ,జగదీశ్ గౌడ్ , కృష్ణ , శ్రీనివాస్ తదితరులు పాల్గున్నారు.



