సంగారెడ్డి లో బీసీ గర్ల్స్ హాస్టల్ భవనాన్ని పరిశీలించిన జగ్గారెడ్డి

సంగారెడ్డి లో బీసీ గర్ల్స్ హాస్టల్ భవనాన్ని పరిశీలించిన జగ్గారెడ్డి

విశ్వంభర, సంగారెడ్డి, ఏప్రిల్ 13: సంగారెడ్డి పట్టణంలోని వెలుగు ఆఫీస్ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న బీసీ గర్ల్స్ హాస్టల్ భవనాన్ని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సోమవారం పరిశీలించారు. భవన నిర్మాణ పనులను దగ్గరుండి చూసిన ఆయన, గదుల నిర్మాణం మరియు భవన డిజైన్‌పై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థినులకు అన్ని విధాలా సౌకర్యంగా ఉండేలా ఈ భవన డిజైన్ ఉందని జగ్గారెడ్డి కొనియాడారు. నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో నిర్మించబోయే మిగతా హాస్టల్ భవనాలను కూడా ఇదే మోడల్/డిజైన్‌తో నిర్మించాలని ఆయన అధికారులకు సూచించారు. నిర్మాణంలో ఉన్న ఈ హాస్టల్‌కు సంబంధించి ఇంకా కొన్ని నిధులు విడుదల కావాల్సి ఉందని జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి జగ్గారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన.. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో మరియు రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి వెంటనే నిధులు మంజూరయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.హాస్టల్ గదులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, విద్యార్థినులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులతో భవనాన్ని త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-04-13 at 11.19.53 AM

Tags:  

Advertisement

LatestNews

ఘనంగా శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కాలని పాదయాత్ర'
సీఎం రేవంత్ కు  బహిరంగ లేఖ రాసిన  CPI ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం 
ప్రీ ,ప్రైమరీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు పంపిణీ .- ప్రిన్సిపాల్ పురం భూపాల్ రెడ్డి .
పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలి . -  హాజరైన వివిధ శాఖల ఉద్యోగస్తులు .
సంగారెడ్డి లో బీసీ గర్ల్స్ హాస్టల్ భవనాన్ని పరిశీలించిన జగ్గారెడ్డి
ఇంటర్ ఫలితాల్లో ‘హయత్​నగర్​ మైనారిటీ రెసిడెన్షియల్’ విద్యార్థినులు ప్రతిభ