మోడల్ స్కూల్‌  టాపర్స్‌కు ఘన సన్మానం

మోడల్ స్కూల్‌  టాపర్స్‌కు ఘన సన్మానం

విశ్వంభర, మర్రిగూడ:-  మండల కేంద్రంలోని  మోడల్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టాపర్స్‌కు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా గౌరవిస్తూ మండల ఎం ఈ ఓ  శారద , పాఠశాల ప్రిన్సిపాల్ ఉయ్యాల వెంకటేశం శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులు సాధించిన విజయాలు మొదటి మెట్టు మాత్రమేనని, ఇకపై మరింత ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగితే వారు ఇంకా ఉన్నత స్థాయిలను అధిరోహించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.

Tags: