పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలి . -  హాజరైన వివిధ శాఖల ఉద్యోగస్తులు .

పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలి . -  హాజరైన వివిధ శాఖల ఉద్యోగస్తులు .

విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా : న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం . ఈ సందర్భంగా పలువురు ఉద్యోగస్తులు మాట్లాడుతూ  నిమ్మకు నీరెత్తని  ప్రభుత్వం అని  రోడ్ల  పాలు అవుతున్న ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలు, ప్రభుత్వo ఇవ్వాల్సిన కరువు బత్యం, డి.ఏ , బకాయలు మరియు పిఆర్సి , ఉసేత్తకుండా వ్యవహరించడం ఉద్యోగుల పట్ల శాపంగా మారింది ఎక్కడో జరిగే యుద్ధానికి ప్రస్తుతం సిపిఎస్ ఉద్యోగస్తులు బలి అవుతున్నారు అని గుర్తు చేశారు. ప్రతి ఉద్యోగి యొక్క ఎన్ పీ ఎస్ ఖాతా నుండి షేర్ మార్కెట్లో ఉద్యోగుల జీవితాలతో జూదం ఆడుతున్న ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ప్రభుత్వం ఇప్పటివరకు పాత పెన్షన్ సాధన గురించి మాట్లాడకపోవడం శోచనీయం డి ఏ , బకాయి లు సిపిఎస్, ఉద్యోగులకు ఏకకాలంలో చెల్లించాలని ఇప్పటివరకు వాయిదాల పద్ధతిలో చెల్లించే నగదు ఇప్పటివరకు ఉద్యోగస్తుల ఖాతాలో జమ కాకపోవడం మరియు రావాల్సిన డి.ఏలు ఇవ్వకుండా ఉండడం ప్రభుత్వ  సావితి తల్లి ప్రేమ అర్థంకాని పరిస్థితిలో ఉద్యోగుల జీవితాలు రోడ్డున పడి  కొన్ని అత్యవసర శాఖలు రాత్రింబవళ్లు సెలవు దినాలలో కూడా పనిచేస్తూ వారి హక్కుల కోసం పోరాటం చేస్తుంటే ప్రభుత్వం ఒకపక్క వారి రాజకీయాల లబ్దికోసం అన్ని విధాల పథకాలను బందులు ఇస్తూ మా ఉద్యోగస్తులకు ఉరితాడు బిగిస్తుందని ఈ నిరసన కార్యక్రమము  జిల్లా న్యాయ శాఖ నుండి పురుడు పోసుకుంది అని , ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని న్యాయశాఖలో జరుగుతుందని ,  తదుపరి కార్యాచరణ రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగస్తులు వివిధ జిల్లాలో  నిరాహార దీక్షలు , ఆమరణ నిరాహార దీక్షలు మరియు చేయబోయే ప్రతి చర్యకు ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుందని ,ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము అని అన్నారు . ఈ కార్యక్రమము టి ఎస్ సి పి ఎస్ ఈ యు రాష్ట్ర కార్యదర్శి ముబిన్ అహ్మద్ అధ్యక్షతన న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పోలేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ శాఖలకు చెందిన ఉద్యోగ ఉపాధ్యాయులు హాజరై పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టారు . ఈ కార్యక్రమంలో రెవెన్యూ, మున్సిపల్ ,కలెక్టరేట్, వివిధ శాఖల ఉద్యోగస్తులు  హాజరయ్యారు . రెవెన్యూ శాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి ఫిరోజ్ సిపిఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నాగముని ,,టి ఆర్ టిఎఫ్  అతిధిగా అధ్యక్షులు ఆవునూరి రవి, రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ విఎండి రఫీక్ జిల్లా కోశాధికారి కొప్పుల నాగరాజు, ,బయ్యారం జిల్లా సిపిఎస్ అధ్యక్షులు రవీందర్ ఉద్యోగస్తులు మరియు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మామిడాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సిద్ధార్థ సీనియర్ న్యాయవాదులు వివిధ శాఖల ఉద్యోగస్తులు ఉద్యోగ సంఘ నాయకులు పెద్ద ఎత్తున హాజరై  జిల్లా కేంద్రంలోని కోర్టు ముందు ఏర్పాటుచేసిన ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపినారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లుతెర్చుకొని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి డి ఏ బకాయిలు పిఆర్సి తో పాటు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలుపరచి ఉద్యోగస్తులను ఆదుకోవాలి లేనిపక్షంలో ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున తదుపరి కార్యాచరణ చేపట్టడం జరుగుతుందని ప్రభుత్వానికి హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో పిఆర్టియు మండల బాధితులు బి రామ్జి నాయక్ యుటిఎఫ్ బాధ్యులు హరి టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు బి రమేష్, ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్  యూనియన్ వివిధ మండల అధ్యక్ష , ప్రధాన, కార్యదర్శులు న్యాయశాఖ, ఉద్యోగులు మున్సిపల్, శాఖ సెంట్రల్ ,ఫారం సెక్రటరీ సింగు రమేష్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు .

Tags:  

Advertisement

LatestNews

ఘనంగా శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కాలని పాదయాత్ర'
సీఎం రేవంత్ కు  బహిరంగ లేఖ రాసిన  CPI ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం 
ప్రీ ,ప్రైమరీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు పంపిణీ .- ప్రిన్సిపాల్ పురం భూపాల్ రెడ్డి .
పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలి . -  హాజరైన వివిధ శాఖల ఉద్యోగస్తులు .
సంగారెడ్డి లో బీసీ గర్ల్స్ హాస్టల్ భవనాన్ని పరిశీలించిన జగ్గారెడ్డి
ఇంటర్ ఫలితాల్లో ‘హయత్​నగర్​ మైనారిటీ రెసిడెన్షియల్’ విద్యార్థినులు ప్రతిభ