సంగారెడ్డి  బైపాస్ రోడ్ లో ఐదు చోట్ల   జంక్షన్ ల ఏర్పాటు : జగ్గారెడ్డి 

సంగారెడ్డి  బైపాస్ రోడ్ లో ఐదు చోట్ల   జంక్షన్ ల ఏర్పాటు : జగ్గారెడ్డి 

  • అన్ని జంక్షన్ లు ఆకర్షణీయంగా ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా తీర్చి దిద్దండి
  • ఐబి జంక్షన్, ఆర్డీవో  క్యాంప్ ఆఫీస్ సర్కిల్ జంక్షన్ లో పర్యటించి హెచ్ఎండిఏ అధికారులకు జగ్గారెడ్డి సూచన

WhatsApp Image 2026-04-13 at 11.16.37 AM (1)విశ్వంభర, సంగారెడ్డి: సంగారెడ్డి  పట్టణం లోని బైపాస్ రోడ్ విస్తరణ  పనులు వేగవంతం అవుతున్నాయి.  రూ. 13 కోట్లతో చేపడుతున్న ఈ బై పాస్ రోడ్ లో  ఐదు చోట్ల జంక్షన్ లు ఏర్పాటు చేయాలని  హెచ్ఎండిఏ  అధికారులకు జగ్గారెడ్డి సూచించారు. ఈ నేపథ్యంలో  ఐబి గెస్ట్ హౌస్ మొదలుకుని బసవేశ్వర చౌక్ వరకు  ఐదు చోట్ల  జంక్షన్ లు ఏర్పాటు కానున్నాయి.  హెచ్ఎండిఏ  అధికారులతో కలిసి  జంక్షన్ లు ఏర్పాటయ్యే   ఐబి చౌరస్తా ఆర్డీవో  క్యాంప్ ఆఫీస్ చౌరస్తా ను పరిశీలించారు. జంక్షన్ లు ఏవిధంగా ఏర్పాటు చేయాలి, జంక్షన్ ల లో సుందరీకరణ పనులు చేయాలని,  జంక్షన్ ల ను  ఆకర్షణీయం గా  తీర్చిదిద్దాలని  హెచ్ఎండిఏ  అధికారులకు జగ్గారెడ్డి సూచించారు. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచెలా జంక్షన్ ల డిజైన్ లు ఉండాలని  కన్సల్టెన్సీ ప్రతినిధుల ను ఆదేశించారు.  జంక్షన్ లు ఏర్పాటు విషయం లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా చూడాలని హెచ్ఎండిఏ  అధికారులకు సూచించారు. రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలని, సాధ్యమైనంత త్వరలో పనులు పూర్తి కావాలని అధికారులకు జగ్గారెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్,  నాయకులు కూన సంతోష్, కిరణ్ గౌడ్ , హెచ్ఎండిఏ  ఇంజనీర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Tags: