గుండెపోటుతో మహిళా మృతి

నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులు

గుండెపోటుతో మహిళా మృతి

విశ్వంభర, భద్రాచలం :  సీతారాం నగర్ కాలనీకి చెందిన మోర్తాల కళావతి (55) బుధవారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.ఈ నేపథ్యంలో, ఆమె భర్త సీతారాం రెడ్డి, కుటుంబ సభ్యులు ఉదారత చూపుతూ డాక్టర్ అగర్వాల్ ఐ బ్యాంక్ అధికారులకు సమాచారం అందించారు. వారి సహకారంతో కళావతినేత్రాలను దానం చేసి, మరొకరి జీవితంలో వెలుగు నింపారు.ఈ కార్యక్రమంలో  కుటుంబ సభ్యులు, స్థానికులు అభినందించారు.

Tags: