పరిగిలో భాజపా శిక్షణ తరగతులు
విశ్వంభర, పరిగి: పట్టణ బిజెపి అధ్యక్షులు బాలకృష్ణారెడ్డి, మండల అధ్యక్షురాలు నీరటి అనసూయ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ మండల శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భాజపా నాయకులు మాట్లాడుతూ.. కార్యకర్తలలో పార్టీ సిద్ధాంతంపై అవగాహన కల్పించడం, క్రమశిక్షణను పెంపొందించడం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యం అన్నారు. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ కలలుగన్న అంత్యోదయ లక్ష్యంతో ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసి, రాబోయే సవాళ్లకు సిద్ధం కావడమే శిక్షణా తరగతుల పరమార్థమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ ఉగ్ర నరసింహ, జనరల్ సెక్రెటరీ నాగేష్, శక్తి కేంద్రం ఇంచార్జ్ యాటకర్ల శ్రీనివాస్ నారాయణ, రవికుమార్, శివకుమార్, తదితరులు పాల్గొన్నారు



