‘రేవంత్‌ను జైల్లో ఎందుకు పెట్టకూడదు?’.. కేటీఆర్ సంచలన ట్వీట్..!

‘రేవంత్‌ను జైల్లో ఎందుకు పెట్టకూడదు?’.. కేటీఆర్ సంచలన ట్వీట్..!

కేటీఆర్ ఘాటుగా స్పందించారు. అసత్య ప్రచారాలకు అలవాటు పడిన సీఎం రేవంత్ రెడ్డిని జైల్లో ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. ఆయన గురువారం ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలను సంధించారు. 

అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కాంగ్రెస్ సర్కార్‌ను ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉంది. మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లు తమదైన శైలిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారు. ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

కేటీఆర్ బంధువు రూ.10వేల కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ వచ్చిందంటూ ఆరోపించారు. దీనిపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. అసత్య ప్రచారాలకు అలవాటు పడిన సీఎం రేవంత్ రెడ్డిని జైల్లో ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. ఆయన గురువారం ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలను సంధించారు. 

Read More హిందూ సమాజం  ఏకం కావాలని రామాలయం కమిటీ  పాదయాత్ర

‘నా బంధువుకు 10000 కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ వచ్చిందని రేవంత్ సిగ్గులేని అబద్ధం చెప్పాడు. అదే జోకర్ నేను సెక్రటేరియట్ కింద ఉన్న నిజాం ఆభరణాలను తవ్వినట్లు నకిలీ కథనాన్ని సృష్టించాడు. ⁠కేంద్ర హోంమంత్రికి సంబంధించిన ఫేక్ వీడియోను రేవంత్ సర్క్యులేట్ చేశారు. సీఎం అయినందున ఓయూకి సంబంధించిన నకిలీ సర్క్యులర్‌ పోస్ట్ చేశాడు’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడర్‌ను ఎందుకు జైల్లో పెట్టకూడదంటూ కేటీఆర్ రాసుకొచ్చారు.