మూడవ చలివేంద్రం ను ఏర్పాటు చేసిన గద్దె విజయ్ నేత  -- ముఖ్య అతిధిగా పాల్గొన్న వాటర్ బోర్డ్ డీజీఎం నాగరాజు

మూడవ చలివేంద్రం ను ఏర్పాటు చేసిన గద్దె విజయ్ నేత  -- ముఖ్య అతిధిగా పాల్గొన్న వాటర్ బోర్డ్ డీజీఎం నాగరాజు

విశ్వంభర, హైదరాబాద్ :- బిఎన్.రెడ్డి డివిజన్ లోని  ఎన్జీవోస్ కాలనీ బస్ స్టాప్ లో మూడవ చలివేంద్రాన్ని ప్రముఖ సామజిక వేత్త , మల్కాజిగిరి టిడిపి అడ్ హక్  కమిటీ సభ్యులు, బి.యన్.రెడ్డి డివిజన్ టిడిపి కాంటెస్టెడ్ కార్పొరేటర్ గద్దె విజయ్ నేత ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రాన్ని వాటర్ బోర్డ్ డీజీఎం నాగరాజు ముఖ్య అతిధిగా పాల్గొని వారి చేతుల మీదుగా మజ్జిగ పంపిణి చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా పలు సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరికి అందుబాటులో ఉంటూ వారికి ఎలాంటి కష్టమొచ్చినా సాయంగా నిలబడుతూ వస్తున్నా గద్దె విజయ్ నేత ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలనీ వారిని అభినందిస్తూ కోరారు. ఈ సందర్బంగా గద్దె విజయ్ నేత మాట్లాడుతూ బి.యన్.రెడ్డి డివిజన్లోని వివిధ ప్రాంతాలలో గత 20 సంవత్సరాలుగా ఆరు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నదని అందులో భాగంగా ఈరోజు కాలనీ బస్ స్టాప్ లో చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని, అదే విధంగా ప్రజలకు అవసరమయ్యే ఏ కార్యక్రమాలైనా చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు.  ఈ కార్యక్రమంలో వాటర్ బోర్డు ఏరియా మేనేజర్ బి భాను ప్రకాష్ రెడ్డి ముత్తుట్  సిఎస్ఆర్ ఫౌండేషన్ మేనేజర్ లక్ష్మీనారాయణ కూడా పాల్గొన్నారు. కాలనీ పెద్దలు వెంకటేశ్వరరావు, అజరత్ నాయుడు , జంగారెడ్డి, సత్యనారాయణ , బుగ్గయ్య, బీ ట్టి ప్రసాద్ , సాయిబాబా , ఉదయ్ రెడ్డి , నాయకులు, ధనలక్ష్మి , ఆంజనేయులు , మురళీధర్  అశోక్ , శివనేత, రామస్వామి , రాహుల్  తదితరులు పాల్గొన్నారు. 

Tags: