ఓ-సిటీని మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతాం

ఓ-సిటీని మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతాం

  • : ఇనగాల వెంకట్రాంరెడ్డి 

విశ్వంభర, హనుమకొండ: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ నగరంలోని ఓ-సిటీలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ వేడుకల్లో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో ఇనుగాల వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ఓ-సిటీతో తనకు ఎంతో కాలంగా ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేశారు. కాలనీవాసుల సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందని, కుడా చైర్మన్ హోదాలో ఓ-సిటీని వరంగల్ నగరంలోనే ఒక ఆదర్శవంతమైన మోడల్ కాలనీగా మార్చే బాధ్యతను తాను తీసుకున్నట్లు వెల్లడించారు. ఇటీవలే ఇక్కడ నిర్వహించిన 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా పారిశుధ్య కార్యక్రమాల్లో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నాయకత్వంలో ప్రతి డివిజన్, ప్రతి కాలనీ అభివృద్ధి చెందాలన్నదే లక్ష్యమని, ఓ-సిటీ సంక్షేమ సంఘం చేస్తున్న కృషికి కుడా తరపున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: