తొల్కట్టలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం
On
విశ్వంభర, మోహినాబాద్ :-మొయినాబాద్ మండలం తొల్కట్ట గ్రామంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ వేడుకలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రామ నామ స్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు.ఈ పవిత్ర కళ్యాణాన్ని బానూరి శబరీ శివశంకర్ గౌడ్ మరియు బి. సౌమ్య గణేష్ గౌడ్ దంపతులు ఘనంగా నిర్వహించారు. రాముల వారి కళ్యాణానికి గ్రామ ప్రజలంతా భారీ సంఖ్యలో హాజరై కళ్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రత్యేక పూజలు, మంగళహారతులు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దర్శనాలు పొందారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఎం. రజిత రవీందర్, ఉప సర్పంచ్ ఎం.డి. ఇనాయత్, వార్డ్ సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, గ్రామ పెద్దలు తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



