ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజల కష్టాలు పట్టించుకునే నాధుడే లేడు

గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వము తక్షణం స్పందించి పరిష్కరించాలి 
   
 సిపిఎం డిమాండ్

WhatsApp Image 2024-07-26 at 16.39.33_4518c950విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 26 :  -  యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలంలోని  గ్రామపంచాయతీలలో కొనసాగుతున్న ప్రత్యేక అధికారుల పాలనలలో సమస్యలు పెద్ద ఎత్తున పేర్కపోయి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించి తగిన నిధులు కేటాయించి గ్రామాల్లో ఉన్న మౌలిక సమస్యలను పరిష్కారం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి వేముల భిక్షం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. శుక్రవారం ఆత్మకూరు(ఎం) మండల పరిధిలోని కురెల్లా గ్రామంలో సిపిఎం పోరుబాట కార్యక్రమంలో గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం గ్రామంలోని పంచాయతీ కార్యదర్శి విఘ్నేశ్వర్ కి మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వేముల భిక్షం పాల్గొని మాట్లాడుతూ గత ఫిబ్రవరి నుండి సర్పంచ్ పాలన ముగిసి ప్రత్యేక అధికారుల పాలన వచ్చిన తర్వాత గ్రామాలలో సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఎవరిని అడగావలేనో అర్థం కాని పరిస్థితులలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గ్రామాలలో రోజురోజుకు మురికి కాలువలు, వీధిలైట్లు, మంచినీళ్ల సమస్యలు పెరుగుతున్నాయని వాటిని తక్షణం పరిష్కారం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. వాగు పై బ్రిడ్జి నిర్మాణం తక్షణం చేపట్టాలని మరియు స్మశాన వాటిక నీళ్ళ, కరెంటు లేక ప్రజలు ఇబ్బంది వాళ్ళ నిరుపయోగంగా ఉంది తక్షణమే వసతులు కల్పించాలని అన్నారు. ప్రభుత్వము ఎన్నికల ముందు ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తానన్న హామీని వెంటనే అమలు చేయాలని, అర్హత కలిగి రేషన్ కార్డు లేని పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలని, అన్ని రకాల పెన్షన్స్ కూడా తక్షణం ఇవ్వాలని వారు ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వము అన్ని గ్రామాలలో సమస్యల పరిష్కారం కోసం ప్రజలందరినీ సమీకరించి సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారం కోసం తగిన నిధులు విడుదల చేయాలని కోరినారు. గ్రామాలలో రోజురోజుకు కోతుల, కుక్కల బెడద పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాటి నివారణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షకాలంతో దోమల బెడద పెరిగి ప్రజలు వివిధ రోగాల బారిన పడుతున్నారని గ్రామాలలో తరచుగా గడ్డి మందు, దోమల నివారణ మందు పిచికారి చేయాలని ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పై సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం స్పందించకపోతే మండల స్థాయిలో ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ కార్యదర్శి తూమ్మలగూడెం యాదయ్య, బాషబోయిన రాములు,మర్రిపల్లి మల్లయ్య , మరుపాక సత్తయ్య, బండ బీరయ్య,గుండా రాజు, భాషాబోయిన ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.