రోడ్డు విస్తరణ పనుల పరిశీలన
On
విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న రహదారి విస్తరణ పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి జలంధర్ రెడ్డి పరిశీలించారు. కొలతల ప్రక్రియను అధికారులు వివరించారు. ఫుట్‌పాత్, రహదారి పక్కన దుకాణాలు నిర్వహిస్తున్న వారితో మాట్లాడి, సమస్యలను తెలుసుకున్నారు. ప్రభావిత వ్యక్తుల పేరు, వృత్తి, వ్యాపారం, గుర్తింపు వివరాలు తదితర సమాచారాన్ని సేకరించి భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వలిగొండ గ్రామపంచాయతీ కార్యదర్శి, కరోబార్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.



