అంబేద్కర్ కి ఘనంగా  నివాళులు 

అంబేద్కర్ కి ఘనంగా  నివాళులు 

విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం ఎన్ డి తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఆంగోత్ అరుణ గోపాల్ నాయక్ పాలకవర్గంతో బాబా సాహెబ్  అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి 135 వ జయంతి  వేడుకలు  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, బాబాసాహెబ్ అంబేద్కర్ జన ప్రభంజనాన్ని జాగృతం చేసిన సామాజిక విప్లవకారుడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సురేఖ  సురేష్, గ్రామ కార్యదర్శి  నవనీత, వార్డ్ మెంబర్స్, రాణి భాస్కర్, చందర్, హరిలాల్, ప్రియాంక వెంకటేష్, సామ్లి   గోవిందు,  అంజి, సాయి,గ్రామ శాఖ అధ్యక్షులు, ఇందిరమ్మ కమిటీ మెంబర్స్, గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags: