కుల వివక్షపై పోరాటానికి ఇది ఆరంభం : సుద్దాల

కుల వివక్షపై పోరాటానికి ఇది ఆరంభం : సుద్దాల

విశ్వంభర, బాగ్ లింగంపల్లి : కుల నిర్మూలన కోసం సాంస్కృతిక పోరాటం నిరంతరం కొనసాగాల్సిందేనని సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ పేర్కొన్నారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏప్రిల్ 11 నుంచి నిర్వహిస్తున్న ఉత్సవాలు ముగింపు కాదని, కుల వివక్షపై ప్రారంభమైన పోరాటానికి ఇది ఆరంభమని అన్నారు. కులం ఉన్నంతకాలం నిజమైన స్వేచ్ఛ సాధ్యం కాదని, కులరహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్. వినయ కుమార్ మాట్లాడుతూ, నాటికలు, పాటలు, నృత్యాల ద్వారా కుల నిర్మూలనపై చైతన్యం విస్తరించిందన్నారు. మంగళవారం రాత్రి జరిగిన “తులసి తీర్థం” నాటిక, “మనుషులంతా ఒక్కటే”, మాస్టార్జీ పాటలు, ఆటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమం ద్వారా సమానత్వం, మానవత్వం సందేశం ప్రతిధ్వనించింది.

Tags: