రాజోలి లో ఘనంగా  సీతారాముల కళ్యాణం 

రాజోలి లో ఘనంగా  సీతారాముల కళ్యాణం 

 విశ్వంభర, రాజోలి:  మహబూబ్ నగర్ జిల్లాలోని  కౌకుంట్ల మండలం రాజోలి వీరాంజనేయ స్వామి విశ్వనాథ దేవాలయంలో  శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఊరంతా ఒక్కటై తమ ఇంట్లోనే పెళ్లి జరుగుతున్నట్టుగా ప్రతి ఒక్కరూ ఊరువాడా పిల్ల జల్ల అంతా కలిసి మేళ తాళాలు భజంత్రీలతో ఆకాశమంత పందిరి వేసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పోతర్ల అరుణ మన్యంకొండ ఆధ్వర్యంలో, ప్రముఖులు కార్యకర్తలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కళ్యాణాన్ని తిలకించి ఆనంద చికితులైనారు. ప్రతి ఒక్కరి కి స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు కళ్యాణ అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Tags: