వార్డు సభ్యులకు నెలకు మూడు వేల గౌరవేతనం ఇవ్వాలి
విశ్వంభర, బాగ్ లింగంపల్లి : తెలంగాణలోని వార్డు సభ్యులకు నెలకు రూ.3 వేల గౌరవ వేతనం, రూ.25 లక్షల ఆరోగ్య బీమా అమలు చేసి, విధుల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.20 లక్షల నష్టపరిహారం అందించాలని వార్డు సభ్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అందే బీరన్న, రాష్ట్ర అధ్యక్షులు అతికం రాజశేఖర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి తగిన గుర్తింపు, సంక్షేమం కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా గౌరవ వేతనం, ఆరోగ్య బీమా, సంక్షేమ పథకాలను తెలంగాణలో కూడా అమలు చేయాలని కోరారు. వార్డు సభ్యుల సేవలను గుర్తించి వారి సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో: రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుముల నవీన్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి సందగిరి వెంకటేష్, ధూపం ఆంజనేయులు, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల సాంబయ్య గౌడ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మూల కరుణాకర్ గౌడ్, రాష్ట్ర నాయకులు గంగధర, గంగజమున వెంకటరమణ, కామెర తిరుమల తదితరులు పాల్గొన్నారు.