అర్హులైన ఓటరు పేరు మిస్ కాకూడదు: మంత్రి పొన్నం
విశ్వంభర, సిద్దిపేట : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా మిస్ కాకుండా పారదర్శకంగా నమోదు చేయాలి, రైతు భరోసా నిధులను ప్రభుత్వం వేగంగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లో మంగళవారం పర్యటించిన మంత్రి హుస్నాబాద్ పట్టణంలోని 17, 18 వార్డులు, ఎల్కతుర్తి మండలం సూరారం, భీమదేవరపల్లి మండలం ధర్మారం గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాలను పరిశీలించారు. బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు ఇంటింటికీ వెళ్లి ప్రతి అర్హుడి వివరాలు నమోదు చేసి, ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ధర్మారం గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అక్కన్నపేట మండలం రాజులతండాలో రూ.2.10 కోట్లతో నిర్మించనున్న బీటీ రహదారికి శంకుస్థాపన చేశారు. రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, విత్తనాల సరఫరా, వ్యవసాయానికి అవసరమైన సౌకర్యాల కల్పన కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణకు అవసరమైన ఎరువులు, కేంద్ర నిధులను పూర్తిస్థాయిలో విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వరంగల్ అభివృద్ధిపై బీజేపీ చేస్తున్న విమర్శలను ఖండిస్తూ, ఎయిర్‌పోర్టు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీతో పాటు పలు అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని మంత్రి తెలిపారు.