మొదటి విడత గృహ గణన విజయవంతం
విశ్వంభర, చింతపల్లి: జనగణన కార్యక్రమంలో భాగంగా 2027 సంవత్సరానికి గాను మొదటి విడత గృహ గణన 2026 మే 11వ తేదీ నుండి ప్రారంభమై 2026 జూన్ 9వ తేదీన మండలంలో విజయవంతంగా ముగిసిందని చింతపల్లి ఎమ్మార్వో విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహణలో భాగంగా మండలంలోని 17 మంది ఉపాధ్యాయులను సూపర్వైజర్లుగా, 99 మంది ఉపాధ్యాయులను ఎన్యుమరేటర్లుగా నియమించి, మండలంలోని వివిధ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో గృహాలను సందర్శించి గణన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన మండలంలోని ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది మరియు ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఎమ్మార్వో విజయలక్ష్మి అన్నారు.