ఓబీసీలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతాం
విశ్వంభర, హైదరాబాదు : ఓబీసీలకు తగిన అవకాశాలు కల్పిస్తే వారిని విజయవంతమైన పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దగలమని అఖిల భారత ఓబీసీ పారిశ్రామిక వేత్తల తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షురాలు భార్యలక్ష్మి తెలిపారు. మంగళవారం హైదరాబాదులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంఈజీపీ వంటి పథకాల ద్వారా ఓబీసీలకు పరిశ్రమల స్థాపనకు సహాయం అందించాలన్నారు. తెలంగాణలో ఉన్న వనరులను ఇతర రాష్ట్రాల వారు వినియోగించు కుంటుండగా, స్థానిక ఓబీసీలకు తగిన ప్రోత్సాహం లేకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 22 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, వారిలో ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాలు లేక వెనుకబడి పోతున్నారని చెప్పారు. రైతులు, నిరుద్యోగ యువత పారిశ్రామిక రంగంలోకి రావాలని పిలుపునిచ్చారు. డైరీ, టైలరింగ్, బ్యూటీషియన్, చిన్న స్థాయి పరిశ్రమలు వంటి రంగాల్లో రూ.5 లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు రుణాలు అందించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్యాంకులు ఓబీసీలకు రుణాల మంజూరులో అనవసర అడ్డంకులు సృష్టిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లలో ఓబీసీల అభివృద్ధికి స్పష్టమైన చర్యలు తీసుకోలేదని, కొందరు మాత్రమే కోటీశ్వరులవు తున్నారని ఆరోపించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రత్యేక పారిశ్రామిక విధానం తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప్పరిచింత రాజేష్, అల్వాల సుధాకర్, పసుపులేటి శంకర్, సికింద్రాబాద్ ఇంచార్జి పసుపులేటి నందకుమార్, గొల్ల రాజేశ్, మారావ్ తదితరులు పాల్గొన్నారు.