విలీనం తర్వాతే ఆర్టీసీ ఎన్నికలు నిర్వహించాలి

విశ్వంభర, బాగ్ లింగంపల్లి:  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాతనే ఎన్నికలు నిర్వహించాలని ఆర్టీసీ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ పేర్కొన్నారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని, విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాతనే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. విలీనానికి సంబంధించిన అపాయింట్‌మెంట్ తేదీని వెంటనే ప్రకటించాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల బకాయిలు, వేతన సవరణలు వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని సూచించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి, రవాణా శాఖ మంత్రి వెంటనే స్పందించాలని అన్నారు. జూన్ 2న విలీనం ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపినా అమలు చేయకపోవడంతో ఉద్యోగుల్లో నిరాశ నెలకొందన్నారు. 2019 సమ్మె సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొంతమంది యూనియన్ నాయకులు సమస్యలను తప్పుదోవ పట్టిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అదనపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమ్ నాథ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనయ్య, రీజనల్ ఉపాధ్యక్షుడు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

🕒 11 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/rtc-elections-should-be-held-only-after-the-merger/article-16481

Tags: