ఎంపీ చామలను కలిసిన కాంగ్రెస్ నాయకులు

ఎంపీ చామలను కలిసిన కాంగ్రెస్ నాయకులు

విశ్వంభర,  నాగారం : భువనగిరి నియోజకవర్గ  ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాతి వెంకన్న ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర సమస్యలను, తెలంగాణ  ప్రభుత్వం ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల ఆరోగ్యమైన భవిష్యత్తు కొరకు సాహసోపేతమైన  గొప్ప నిర్ణయం తీసుకొని విజన్ తో ముందుకెళ్తున్న మన రాష్ట్ర ప్రభుత్వానికి అందించాల్సిన  ఆర్థిక చేయుతలాంటి అంశాల గురించి  ప్రస్తావించి,పరిష్కారానికి కృషి చేయాలని నాతి వెంకన్న గౌడ్  కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల, ఉమ్మడి నల్గొండ ,భువనగిరి పార్లమెంట్ ప్రజల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని స్తానని  ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి  తెలిపారు.

Tags: