శివ గంగ రాజరాజేశ్వర ఆలయ ఆదాయం రూ.3.2 లక్షలు
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలోని గత నాలుగు రోజుల నుండి శ్రీ శివ గంగ రాజరాజేశ్వర బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. శివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో హుండీ ఆదాయం 3,23,760 రూపాయలు వచ్చినట్లు ఆలయ కమిటీ చైర్మన్ అల్లే కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ అల్లే కుమార్ మాట్లాడుతూ, శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయన్నారు. శివరాత్రి ఉత్సవాల్లో అన్ని ఖర్చులు పోను 5 లక్షలు బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ చేస్తున్నట్లు తెలిపారు. దాతల సహకారం తో ఆలయాన్ని మరింత అభివృద్ధిచేయడానికి కృషి చేస్తామని తెలిపారు, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మునగాపాటి నవీన్,మాజీ ఎంపీటీసీ పోతర్ల సుదర్శన్ యాదవ్,సిరిగిరిపురం మాజీ సర్పంచ్ కాసుల సురేష్, నాయకులు కాకి పరమేష్, టీ నాగేశ్వర్, టీ ప్రకాష్,గ్రామ పెద్దలు,మాజీ ఆలయ కమిటీ చైర్మన్లు,మాజీ సర్పంచులు, డైరెక్టర్లు కూన యాదయ్య,కాకి ఈశ్వర్, స్వర్ణగంటి ఆనందం,బొబ్బిలి పూర్ణ చంద్రారెడ్డి, సూర్యనారాయణ రెడ్డి,దోమ శ్రీనివాస్ రెడ్డి, వి శ్రవణ్,సుధీర్ గౌడ్, పోతర్ల సుదర్శన్ యాదవ్,అల్లే బిక్షపతి,ఏకలవ్య,వీరి బాబు, ఎం రాకేష్,ఒగ్గు శంకర్, జి నరేష్,ఈ వో మురళీకృష్ణ, టీ నాగేశ్వర్ రావు, ఎం రమేష్, పోతర్ల తిరుపతయ్య,కర్రోళ్ల రాములు, ఎస్ సంజీవ, జి రాజ్ కుమార్ రావు, లక్ష్మయ్య,మైసయ్య,విజయ్,కృష్ణ తో పాటు తదితరులు పాల్గొన్నారు.



