ఈఫిల్ టవర్ బాలసముద్రం హనుమకొండ ఆధ్వర్యంలో గణనాధుని నిమజ్జనం.  

 చైర్మన్ - నామిరెడ్డి సీతారామ్ రెడ్డి .

ఈఫిల్ టవర్ బాలసముద్రం హనుమకొండ ఆధ్వర్యంలో గణనాధుని నిమజ్జనం.  

విశ్వంభర, హనుమకొండ జిల్లా :- గ్రేటర్ వరంగల్ 30 వ డివిజన్ ఈఫిల్ టవర్ బాలసముద్రం లో గణపతి నవరాత్రి ఉత్సవాలను బాలసముద్రం కాలనీ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ చైర్మన్ నామిరెడ్డి సీతారాం రెడ్డి హమేంద్రదేవి నేతృత్వంలో గణనాథుని నిమజ్జనం శుక్రవారం అట్టహాసంగా నిర్వహించారు.  చైర్మన్ నామిరెడ్డి సీతారాం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.  గత నవరాత్రులలో గణనాధునికి పూజలు నైవేద్యాలు అర్చనలు ఎంతో ఘనంగా నిర్వహించారని వీటితోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు.  1500 మందికి అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారని అన్నారు.  గణనాధుని దీవెన వలన భారత దేశ ప్రజలు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో కన్వీనర్ చెన్నం రవీందర్ రెడ్డి, డాక్టర్ న్యాతాని మారామ్ ,సుధాకర్ రెడ్డి ,శ్యాంసుందర్ రెడ్డి ,బిక్షపతి, రమేష్ శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు

Tags: