పెద్దపులి నాగారంలో అంబేద్కర్ జయంతి
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో జర్నలిస్టు చిక్కిరి శ్రీకాంత్ నివాసానికి వచ్చి పలు సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య, మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ కావలి దశరథ, గణపురం రాజు గ్రామ శాఖ అధ్యక్షులు ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు, ఎండి అన్వర్, గ్రామ శాఖ వైస్ ప్రెసిడెంట్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గాజులపల్లి నరసింహ మాజీ వార్డు సభ్యులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కొత్తపల్లి సిద్ధులు గౌడ్, మాజీ వార్డు సభ్యులు, కావలి శ్రీశైలం, ఎండి షాకెర్ మండల్ ఎన్ఎస్ఈఐ ప్రెసిడెంట్, ఎండి అబ్బాస్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కుండే ఈశ్వరయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అభిమానులు అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.



