ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల కోడ్ ముగియడంతో దరఖాస్తుల పరిశీలనపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారలకు సూచించారు.
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల కోడ్ ముగియడంతో దరఖాస్తుల పరిశీలనపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారలకు సూచించారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఇందిరమ్మ ఇళ్లకు82.80 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు.
మరోవైపు ఏడాదికి 4.50లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లలో 22.50లక్షల ఇళ్లు నిర్మించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, లబ్ధిదారుల ఎంపిక అధికారులకు సవాల్‌గా మారనుంది. దీంతో ఇతర రాష్ట్రాల్లో అమలుచేస్తున్న గృహ నిర్మాణ పథకాలపై అధ్యయనం చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
ఇదిలా ఉంటే దరఖాస్తులతో పోలిస్తే మంజూరు చేసే ఇళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదనలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తామని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు.