రైతుల ముఖాల్లో చిరునవ్వు చూడటమే ప్రభుత్వ లక్ష్యం
- శాసన సభ్యులు నేనావత్ బాలునాయక్
విశ్వంభర, చింతపల్లి : రైతుల ముఖాల్లో చిరునవ్వు చూడటమే ప్రభుత్వ లక్ష్యం దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలునాయక్ అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాము పండించిన పంటను అమ్ముకోవడానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి గ్రామాల్లోనే కొనుగోలు సౌకర్యం కల్పించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అన్నారు. రైతులు ఆష్ట కష్టాలు పడి పండించిన ప్రతి గింజకు మద్దతు ధర కల్పించడంతో పాటు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేలా మేము చర్యలు తీసుకుంటున్నాము. క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తూకం నుంచి నగదు జమ వరకు ప్రతి ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా అధికారులకు సూచించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం మరియు రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందన్నారు. అన్నదాతల ముఖాల్లో చిరునవ్వు చూడటమే మా అసలైన విజయమని రైతు సోదరులందరూ ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం మార్కెట్ లో ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య, ఎంపీడీవో సుజాత, ఎమ్మార్వో విజయలక్ష్మి, మండల వ్యవసాయ అధికారిని శ్రావణ కుమారి, ఎంపిఓ హిందూజా, మండల పార్టీ అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం, మాజీ ఎంపీపీ కొండూరు భవాని పవన్ కుమార్, పిఎసిఎస్ చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ముచర్ల యాదగిరి, డిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల వెంకటయ్య గౌడ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



