కొనసాగుతున్న 56'వ హజ్రత్‌ అబ్బాస్‌ దర్గా ఉర్సు ఉత్సవాలు

కొనసాగుతున్న 56'వ హజ్రత్‌ అబ్బాస్‌ దర్గా ఉర్సు ఉత్సవాలు

విశ్వంభర, చింతపల్లి:మండలంలోని పీకే మల్లేపల్లిలో హజ్రత్‌ అబ్బాస్‌ దర్గా షరీఫ్‌ 56 వ, ఉర్సు ఉత్సవాలు కొనసాగుతున్నాయి. దర్గా వద్ద భక్తులు దీపారాధనలు, కందుర్లు, మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. దర్గా వద్ద పక్కనే ఉన్న గిరి మక్కా మహేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, ఆశీర్వచనాలంటి కార్యక్రమాలు  నిర్వహించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు రంగారెడ్డి,హైదరాబాద్‌, ఏపీ రాష్ట్రం ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు అన్నదానం చేశారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర రోడ్స్ డెవలప్ మెంట్ ఛైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి దర్గాను దర్శించుకున్నారు. దర్గా ముత్తావల్లి ఎండి.చాంద్‌పాష వారికి ప్రసాదాలు అందజేశారు. వీరితో పాటుగా ఈ కార్యక్రమంలో ముద్దగౌని రామ్ మోహన్ గౌడ్, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ ఛైర్మన్ గుర్నాథ్ రెడ్డి, సొసైటీ బ్యాంకు ఛైర్మన్ పాండు రంగారెడ్డి, జడ్పిటిసి మహిపాల్, మార్కెట్ డైరెక్టర్ మహేష్ గౌడ్, ఎండీ.గౌస్, రాఘవేందర్, ఫిరోజ్, అమీర్, సల్మాన్,మరియు దర్గా కమిటీ ఛైర్మన్ కేవీ రమేష్ రాజు, ఆర్గనైజర్ ఎండీ. సయ్యద్ పాషా, సబ్ ట్రెసరేర్ ఎండీ.యూసఫ్ పాషా, కృష్ణ, ఎండీ.షరీఫ్ పాషా, దర్గా కమిటీ మెంబర్లు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags: