ఉద్యమ కారుల ఆశయాల సాధనకు ఉద్యమ పురటి గడ్డ "ఎల్బి నగర్ నుండి మరో పోరాటానికి సిద్ధం"
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాచం సత్యనారాయణ
- డిసెంబర్ 3 లోపు ఎల్బి నగర్ చౌరస్తాకు శ్రీకాంతచారి చౌరస్తాగా నామకరణం చేయాలి
- తెలంగాణ పొలిటికల్ యువజన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన మహనీయుల జయంతి పాదయాత్ర అభినందనీయం
- ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాల్సిందే లేదంటే మరో పోరాటం తప్పదు
- తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాచం సత్యనారాయణ
విశ్వంభర,యాదాద్రి భువనగిరి : ఉద్యమ కారుల ఆశయాల సాధనకు ఉద్యమాల పురటి గడ్డ ఎల్బి నగర్ నుండి మరో పోరాటానికి సిద్దమని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాచం సత్యనారాయణ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా పొడిచేడు గ్రామం నుండి యాదాద్రి భువనగిరి వరకు వంద కిలోమీటర్ల తెలంగాణ పొలిటికల్ యువజన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన మహనీయుల జయంతి పాదయాత్ర ను కాచం సత్యనారాయణ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా పొడిచేడు గ్రామం లొ శ్రీకాంత చారి విగ్రహనికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాంత చారి విగ్రహం సాక్షిగా తెలంగాణ పొలిటికల్ యువజన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన మహనీయుల జయంతి పాదయాత్ర కు అందరు మద్దతు పలికి విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు. మహనీయులు జయంతిలను గుర్తుకు చేస్తు చేపట్టిన ఈ పాదయాత్ర అభినందనీయం అన్నారు. .jpeg)
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు శ్రీకాంత చారి పెట్రోల్ పోసుకొని ఆత్మార్పణ చేసుకున్న సందర్బం యావత్ ప్రపంచం ముందు ఇంకా మెదలాడుతూనే ఉందన్నారు. నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచేటప్పుడు కూడా నా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మళ్లీ జన్మంటూ ఉంటే కూడా తెలంగాణ రాష్టం కోసం సమీదనై పోతానని కోరుకున్న తొలి ఉద్యమ వీరుడు శ్రీకాంతచారి అని పేర్కొన్నారు. కానీ శ్రీకాంతచారి చనిపోయి 15 సంవత్సరాలైనా నేటికీ ఉద్యమ ఆశయాలు మాత్రం నెరవేరలేదు అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొమ్మిదిన్నరెండ్లలొ కేసిఆర్, బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చి రెండేండ్లు అయిన కానీ తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుల ఆశయాలు మాత్రం సిద్ధించలేదన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వారి మేనిఫెస్టో లొ ఇచ్చిన హామీ మేరకు ఉద్యమకారులు రెండు వందల యాభై గజాల స్థలం, ఇరవై ఐదు వేల పింఛన్ ఉద్యమ కారులకు ఇవ్వాల్సిందే అని అన్నారు. లేని పక్షం లొ ఉద్యమ కారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో లొ రాష్ట్రము లొ ఉన్న అన్ని ఉద్యమకారుల సంఘాలను కలుపుకొని ఉద్యమ పురటి గడ్డ ఎల్బి నగర్ నుండి మరో పోరాటానికి సిద్ధం అని ఆయన ప్రకటించారు. అలాగే డిసెంబర్ మూడు లోపు ఎల్బి నగర్ చౌరస్తాకు శ్రీకాంత చారి చౌరస్తాగా నామకరణం చేయాలనీ ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లొ శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ వెంకటాచారి , పొడిచెడు గ్రామ సర్పంచ్ సైదులు, శ్రీకాంత చారి సోదరుడు రవి చారి , తంగళ్లపల్లి గిరిధర చారి, కొంగరి మహేష్, ఇంజమూరి రాము కందుల ఆంజనేయులు, తొర్రి సురేష్, సరూపంగ కుమార్, కుంచం రాజు, నామొజు రాజు చారి, పడిగేమ్ శ్రీనివాస్, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు



