కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
విశ్వంభర, మిర్యాలగూడ: మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు వేములపల్లి మరియు మాడ్గులపల్లి మండలాలకు చెందిన 60 మంది లబ్ధి దారులకు 60లక్షల 6వేల 960 రూపాయల విలువ గల కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భారం కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సహాయం అందిస్తోందని, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడమే కాంగ్రెస్ లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో సంక్షేమ పథకాలను పారదర్శకంగా, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ అందజేస్తున్నామని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు, మండల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు బి ఎల్ ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.



