మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు

విశ్వంభర, వరంగల్ :-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్ సహకారంతో హానుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల పరిధిలోని వంగపహాడ్, నాగారం గ్రామాలలో పాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ముఖ్య అతిధులుగా హాజరైన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు కుడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డితో కలిసి కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి సోమవారం ఘనంగా ప్రారంభించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా,పంటకు సరైన మద్దతు ధర లభించేలా ప్రభుత్వం ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారుఅనంతరం ఎమ్మెల్యే నాగరాజు రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.రైతులకు న్యాయమైన ధరలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు.రైతులు పండించిన మొక్కజొన్న పంటకు మద్దతు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, మధ్యవర్తుల ద్వారా రైతులు నష్టపోకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకే మొక్కజొన్న పంటను తీసుకువచ్చి విక్రయించాలని సూచించారు.రైతుల సంక్షేమమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే దేశం అభివృద్ధి సాధిస్తుందన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో రైతులకు మేలు చేసే విధంగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు.మొక్కజొన్నల కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా అధికారులకు సూచనలు చేశారు.అలాగే కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు తాగునీరు,టెంట్లు ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మార్క్‌ఫెడ్ అధికారులు,అసిస్టెంట్ రిజిస్ట్రార్ సర్కిల్ ఆఫీసు జగన్మోహన్ రావు,నోడల్ ఆఫీసర్ సునీల్ కుమార్,మండల ఏవో అనురాధ, 
పీఏసీఎస్ వంగపహడ్ స్పెషల్ అఫిసర్ సత్యానంద్,సీఈవో పరమేశ్,నాగారం స్పెషల్ ఇంచార్జి ఆఫీసర్ కృష్ణవేణి,పెగడపెల్లి సొసైటీ ఇంచార్జి సీఈవో గణేష్ గౌడ్,స్టాఫ్ అసిస్టెంట్ యశ్వంత్,పాక్స్ ప్రతినిధులు,రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More బిజెపి ఇంటింటి ప్రచారం 

Tags: