త సరదా విషాదంగా మారకూడదు

త సరదా విషాదంగా మారకూడదు


  •  మైనర్ల కు వాహనాలు ఇవ్వకండి 
  •  ఎస్పీ నరసింహ

  విశ్వంభర, సూర్యాపేట: వేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో పిల్లలు, యువకులు ఈత నేర్చుకోవడానికి   చెరువులు , కాలువల వద్దకు వెళ్లే అవకాశం ఉన్నందున  ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణ నష్టం జరుగుతుండటం వలన అందరూ ఈ  విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఈత సరదా విషాదంగా మారకూడదు అని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సూచించారు. ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని ఈతను నేర్చుకునే వారు వారి తల్లిదండ్రుల సమక్షంలో నేర్చుకోవాలని సూచించారు. ముఖ్యoగా తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువుల వద్దకు కాలువల వద్దకు కుంటలు వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగినట్లయితే పిల్లల ప్రాణానికి ప్రమాదమని ఇట్టి విషయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకొని పిల్లలను యొక్క కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా  మైనర్ డ్రైవింగ్ లపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగినదని తల్లిదండ్రుల, మైనర్లకు వాహనం ఇవ్వకూడదని, వాహనం ఇచ్చినచో వారు తెలిసి తెలియని డ్రైవింగ్ తో వాహనం నడపటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని,  దానితో వారికి ఎదుటి వ్యక్తులకు ప్రమాదం జరగటం వల్ల రెండు కుటుంబాలు నష్ట పోతున్నాయని కావున మైనర్ లకు వాహనాలు ఇవ్వకూడదని, ఒకవేళ మైనర్ కు వాహనం ఇచ్చి ఏదైనా ప్రమాదం జరిగిన లేదా మైనర్ డ్రైవింగ్ చేస్తూ వాహనం తో పట్టుబడిన వాహన యజమాని పై కేసు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు.

Tags: