అంగన్‌వాడీల్లో నాణ్యమైన ఆహారం
విశ్వంభర, సిద్దిపేట: అంగన్‌వాడీ కేంద్రాలను చిన్నారుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామ సర్పంచ్ ఆకుల స్వప్నహరీశ్ అన్నారు. అంగన్‌వాడీల్లో నాణ్యమైన పౌష్టికాహారం లభిస్తుందని చెప్పారు. పౌష్టికాహారంతోనే పిల్లలు మానసికంగా, శారీరకంగా ఎదుగుతారని తెలిపారు. గ్రామంలోని మూడు అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో మంగళవారం గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సర్పంచ్ స్వప్న-హరీశ్ హాజరై మాట్లాడారు. పై చదువులకు వెళ్లే చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే ఓ జ్ఞాపకంగా ఉంటుందన్నారు. అనంతరం మండల స్థాయి 8వ పోషణ్ పక్వాడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బెజగం కృష్ణ, సెక్రటరీ అరుణ, గ్రామ కేబినెట్ మంత్రులు, ఐసీడీఎస్ అధికారిణి దివ్య, సీఆర్పీ లావణ్య, అంగన్వాడీ టీచర్స్ అంజమ్మ, రేణుక, చిలుక, నారాయణరావుపేట మండల అంగన్వాడీ టీచర్స్, ఆశాలు, ఆయాలు, తదితరులు పాల్గొన్నారు.



