బూత్ స్థాయి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ

బూత్ స్థాయి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ

 విశ్వంభర, సంగారెడ్డి: పటాన్‌చెరు మండలానికి చెందిన బూత్ స్థాయి అధికారులు, పర్యవేక్షకులు,  బూత్ స్థాయి ప్రతినిధుల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం రుద్రారంలోని గీతం కళాశాలలో జరిగింది. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ హరిబాబు మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించే విధానాలపై అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో బూత్ స్థాయి సిబ్బంది కీలక పాత్ర పోషిస్తారని, తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్ అమరేందర్ రెడ్డి, సహాయ మాస్టర్ ట్రైనర్లు చంద్రారెడ్డి, సయ్యద్, మధుసూదన్ రెడ్డి, శివలీల మరియు ఎన్నికల విభాగానికి చెందిన సంతోష్ కుమార్ పాల్గొన్నారు.అదేవిధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన శ్రీధర్ చారి, కాంగ్రెస్ పార్టీకి చెందిన నర్సింహారెడ్డి, ఖయ్యూం మతిన్ తమ తమ పార్టీ ప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.

Tags: