పాఠశాలలను సందర్శించిన స్పెషల్ మానిటరి టీం
On
విశ్వంభర, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ ఆదేశానుసారం. మండల పరిధిలోని ప్రభుత్వ
ఉన్నంత పాఠశాల. జూలూరుపాడు, కేజీబీవీ పాఠశాల, సెంట్ ఆంటోనీ పాఠశాలలను పదో తరగతి ఇంటర్నల్
మార్కులను స్పెషల్ మానిటరింగ్ వారు సందర్శించారు. ఈ మానిటరింగ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు భద్రాద్రి
కొత్తగూడెం జిల్లాలో నీ సందర్శించడం జరిగిందని .ఎంఈఓ జుంకీలాల్ తెలిపారు. ఈ సందర్భంగా పదో తరగతి
విద్యార్థుల ఇంటర్నల్ మార్క్స్ సందర్శనలతో పాటు వాటికి సంబంధించిన రిజిస్టర్ లను పరిశీలించడం
జరుగుతుందన్నారు. గతంలోనూ ఈ టీం పదవ తరగతి ఇంటర్నల్ మార్క్స్ ను పరిష్కరించడం జరిగిందని
ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం ఆదేశించడంతో స్పెషల్ టీం మన జూలూరుపాడు మండలానికి వచ్చిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ టీం లీడర్ .పి సంజీవరావు తో పాటు సబ్జెక్టు వారిగా టీం సభ్యులు పాల్గొన్నారు.



