రామన్నపేట నియోజకవర్గం ఏర్పాటు చేయాలి
On
విశ్వంభర, రామన్నపేట: తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రామన్నపేట నియోజకవర్గం ఏర్పాటు చేయాలని నకిరేకల్ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి, ఎస్సీ మోర్చా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నకిరేకంటి మొగులయ్య కోరారు. గతంలో నియోజకవర్గంగా ఉన్న రామన్నపేట, 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొల్పోయిందని, మళ్ళీ రామన్నపేట నియోజకవర్గంను ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని, రామన్నపేట మండల కేంద్రం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు ఉన్న ప్రాంతమని, ఈ విషయంపై అతి త్వరలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలవనున్నామని నకిరేకంటి మొగులయ్య తెలిపారు.



