వృద్ధుల రక్షణకు ప్రత్యేక చర్యలు
- - సీనియర్ సిటిజన్ కమిటీలు ఏర్పాటు
- వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పోషణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు - : ఎస్పీ నరసింహ
విశ్వంభర, సూర్యాపేట: జిల్లాలో వృద్ధుల రక్షణ, భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని దీనిలో భాగంగా జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీనియర్ సిటిజన్ భద్రత కమిటీలు ఏర్పాటు చేశాం అని జిల్లా ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, పెద్దల పోషణ, బాధ్యత పూర్తిగా వారి వారసులదేనని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ తీసుకుంటున్న ముఖ్య చర్యలు గురించి వెల్లడించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో "సీనియర్ సిటిజన్ రక్షణ కమిటీలను" ఏర్పాటు చేస్తున్నాము అన్నారు. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధుల వివరాలను సేకరించి, వారికి పోలీస్ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారు అన్నారు. వృద్ధుల పట్ల నిర్లక్ష్యం వహించినా, వారిని శారీరకంగా లేదా మానసికంగా వేధించినా "సీనియర్ సిటిజన్ చట్టం" ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాము అని హెచ్చరించారు. వృద్ధాప్యంలో ఉన్న వారిని ఆదరించడం, వారికి అవసరమైన వైద్య, ఆహార, వసతి సదుపాయాలు కల్పించడం వారసుల ప్రాథమిక కర్తవ్యం అన్నారు. తల్లిదండ్రులను, వృద్ధులను నిర్లక్ష్యం చేసే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయడమే కాకుండా, బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని ఎస్పీ తెలిపినారు. వృద్ధులు ఎలాంటి సమస్యలు ఉన్నా, వేధింపులకు గురవుతున్నా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో లేదా పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు