తెలంగాణతో సోనియాది పేగుబంధం: రేవంత్ రెడ్డి
తెలంగాణతో సోనియాది పేగుబంధం అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు.
తెలంగాణతో సోనియాది పేగుబంధం అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ప్రజల కలలను నిజం చేసిన సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీని ఎందుకు ఆహ్వానించారని కొందరు ప్రశ్నిస్తున్నారని రేవంత్ అన్నారు. కానీ తల్లిని పిలవడానికి ఎవరి అనుమతి లేదని రేవంత్ చెప్పుకొచ్చారు. ‘ప్రపంచంతో నా తెలంగాణ పోటీ పడుతోంది.. ప్రపంచ పటంలోనే హైదరాబాద్‌ను ప్రత్యేకంగా నిలపబోతున్నాం’ అని రేవంత్ రెడ్డి అన్నారు. సర్వ
అదేవిధంగా 70 రోజుల్లోనే 30వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు, 11,062 పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆరు గ్యారంటీలకు 1.28కోట్ల దరఖాస్తులు వచ్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో డూప్లికేట్ అప్లికేషన్లు మినహాయించగా 1.9కోట్ల దరఖాస్తులు మిగిలినట్లు చెప్పారు. వాటిని కంప్యూటరీకరించి ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందుబాటులోకి తేవాలని కృషి చేస్తున్నట్లు తెలిపారు.