కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ

కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ

విశ్వంభర, నెల్లికుదురు: మండలంలోని మునిగలవీడు గ్రామంలోని లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, సిఎం ఆర్ఎఫ్ చెక్కులను మంగళవారం ఆ గ్రామ సర్పంచి బొల్లికొండ చైతన్య నాగరాజు అందజేశారు. కళ్యాణ లక్ష్మి  చెక్కును కాసర్ల పద్మ, సీఎంఆర్ఎఫ్ చెక్కులను చొప్పరి మహేష్, దుస్స ఎల్లయ్య లకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, యువతుల వివాహాల కోసం, అనారోగ్య బాధితుల కోసం ప్రభుత్వం అందించే సహాయం ఎంతో గొప్పదన్నారు. అర్హులందరూ సంబంధిత పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తుప్పతూరి నర్మదా రాజు, గిరగాని ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొల్లికొండ నాగరాజు, నాయకులు,  కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: