#అయ్యగారిపల్లి లో సేంద్రీయ సజ్జ సాగుDraft: Add Your Title

#అయ్యగారిపల్లి లో సేంద్రీయ సజ్జ సాగుDraft: Add Your Title

విశ్వంభర, ఇనుగుర్తి: ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చిరుధాన్యాలను సైతం సేంద్రీయ సాగు పద్ధతిలో ఇనుగుర్తి మండలం అయ్యగారి పల్లి గ్రామానికి చెందిన జిల్లా ఆదర్శ ఆర్గానిక్ రైతు పెండం వెంకన్న పటేల్ తన వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా 'నవారా' తదితర వరి పంటలను పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆరోగ్యప్రదాయి నులైన చిరుధాన్యాలను  పండిస్తూ మార్గ దర్శకంగా నిలుస్తున్నాడు.సజ్జ పంటను సాగు చేయడంతో కంకి పొడవుగా మేలురకంగా కనిపిస్తోంది. పెండెం వెంకన్న పటేల్ ఆర్గానిక్ పద్ధతిలో సాగుచేసిన సజ్జ పంటను జీవన్ ఆధార్ సొసైటీ కి చెందిన సాక్రుబాయి మంగళవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు.సజ్జ పంటను చూసి సంతోషం వ్యక్తం చేశారు.చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని సహజ సాగు పద్ధతిలో సజ్జలను పండించడం పట్ల రైతు  ఆమె అభినందించారు. రసాయన సాగుకు పాల్పడుతున్న ప్రస్తుత తరుణంలో గోఆధారిత వ్యవసాయం చేస్తున్న పెండెం వెంకన్న పటేల్ కృషి అపూర్వమన్నారు.

Tags: