సమాజ మార్పులను శాస్త్రీయ దృక్పథంతో అర్థం చేసుకోవాలి

సమాజ మార్పులను శాస్త్రీయ దృక్పథంతో అర్థం చేసుకోవాలి

విశ్వంభర, హైదరాబాదు : సమాజంలో జరుగుతున్న మార్పులను శాస్త్రీయ దృక్పథంతో అర్థం చేసుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాదు బండ్లగూడలో నిర్వహించిన రాష్ట్ర పార్టీ ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను ప్రారంభించారు. కమ్యూనిస్టు కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలపై అవగాహన పెంపొందించుకుని క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలు సామాన్యులపై భారంగా మారుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా లౌకికవాద శక్తులు ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రం రాజ్యాంగబద్ధ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో ఈటి నర్సింహా, విఎస్ బోష్, మధుకర్, బిఎస్ ఆర్ మోహన్ రెడ్డి, ఉజ్జిని రత్నాకర్ రావు, సిహెచ్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: