గంజాయి స్వాధీనం
On
విశ్వంభర, రామన్నపేట: మంగళవారం మధ్యాహ్నం యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రం శివారులో ఉన్న గరిక సత్యనారాయణ ఫంక్షన్ హాలు వెనుకాల ఉన్న ఖాళీ ప్రదేశంలో గంజాయి తాగుతున్నారని సమాచారం రాగా, రామన్నపేట ఎస్సై, పోలీసు సిబ్బంది అక్కడికి వెళ్లి చోడగా నలుగురు వ్యక్తులు పిల్లీ నవీన్ , శాపెల్లి గ్రామం నార్కెట్పల్లి మండలం, క్రాంతికుమార్ నివాసం ఎనుగులదోరి గ్రామం నార్కెట్పల్లి మండలం, సూరారం ప్రసాద్ నివాసం బాచుప్పల గ్రామం, రామన్నపేట మండలం, మేడి లోకేష్ నివాసం రామన్నపేట గ్రామం, మండలం నుంచి 120 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రామన్నపేట ఎస్సై నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.



